ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Punjab: పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగుల బెట్టారు. ఈ సీజన్‌లో పంజాబ్ లో కేసుల సంఖ్య 8,404కి చేరిపోయింది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీని వణికించిన తీవ్ర వాయు కాలుష్యం.. ఇప్పుడు హర్యానాకు చేరింది. హర్యానాలో కాలుష్య విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్‌లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు.
కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగలబెట్టిన రైతులకు విధించే పెనాల్టీని రెట్టింపు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రూ.30,000 వరకు జరిమానాను విధించేలా ఆదేశాలు జారీ చేసింది.
Pakistan: పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) సమీపిస్తోంది. కోట్లాది మంది భారతీయులు ఈ పండుగను మెరిసే దీపకాంతులతో వెలుగులతో ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ మనకు ఆనందాన్ని, ఐక్యతా అనుభూతిని కలిగిస్తుంది. దీపావళి సందర్భంగా చాలా బాణాసంచా కాల్చుతారు.
Air Pollution : దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. దీపావళి, చలి కారణంగా మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, దీనిని ఎదుర్కొనేందుకు తమ సన్నాహాలను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో గాలి కాలుష్యం బాగా క్షీణించింది. ఈ క్రమంలో శీతాకాలం, పండుగలు వస్తుండటంతో వివిధ రాష్ట్రాల్లోని వైద్యారోగ్య శాఖలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హెచ్చరికలను జారీ చేసింది.
ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా క్షీణించినందున ఉదయాన్ని బయటకు వెళ్లకపోవడం మంచిదని తన వ్యక్తిగత డాక్టర్ సలహా ఇచ్చారని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇంట్లో ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెప్పినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
Supreme Court: చలికాలం సమీపిస్తుందంటే చాలు.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.