కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా దేశ రాజధాని ఢిల్లీ మారిపోయింది. పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాలలో గాలి నాణ్యత ఘోరంగా దిగజారింది. ప్రతి ఏటా వింటర్‌లో ఈ బాధ తప్పట్లేదు. దాంతో చలికాలం వస్తోందంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఢిల్లీలో గాలి విషంతో సమానం. ఊపిరితిత్తుల క్యాన్సర్, హృద్రోగాల వల్ల కలిగే మరణాల్లో 33 శాతం వాయు కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తిన ప్రతిసారి…
ఢిల్లీలో “సంక్షోభం లాంటి పరిస్థితి” ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ రోజు తిరిగి సర్వోన్నత న్యాయస్థానం లో విచారణ ప్రారంభం అయింది. పంట వ్యర్ధాలను కాల్చడం ద్వారా కలిగే వాయు కాలుష్యం కేవలం 10 శాతమే అని నిర్ధారణ అయుందని ధర్మాసనానికి వివరించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అయుతే, “దేశ రాజధాని ప్రాంతం” ( ఎన్.సి.ఆర్) పరిధిలోకి వచ్చే ఢిల్లీ పొరుగు ప్రాంతాల్లో కూడా నిర్దిష్ట పరిమితులు, నిబంధనలు అమలు చేయాలని అఫిడవిట్ లో పేర్కొంది…
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి వారం పాటు విద్యాసంస్థలు బంద్ చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసులు కూడా వారం పాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 17 వరకు ఎలాంటి భవన నిర్మాణ పనులు…
అసలే కాలుష్యం.. ఆపై దీపావళి తోడైంది. దీంతో దేశ రాజధాని ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఢిల్లీ లోని వాహనాలు, నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు, పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత, బొగ్గు ఆధారిత విద్సుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే కాలుష్యం ఇబ్బందుల పాలు చేస్తోంది. దీనికి తోడు దీపావళి పండుగ కాలుష్యం కూడా తోడవడంతో పరిస్థితి విషమించింది. ధూళి అణువులు 2.5 మైక్రాన్స్ పరిమాణంలో…
ఇప్పటికే కరోనాతో ప్రజలు అల్లాలాడిపోతుంటే మరో వైపు కాలుష్యంతో ఇతర సమస్యలు వచ్చిపడుతున్నాయి. తాజాగా దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధికమవుతుందన్నారు. ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమ స్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. కాలుష్యం అధికంగా ఉన్న గాలిలో వైరస్ ఎక్కువ కాలం బతికి ఉంటుం దన్నారు. దీని వల్ల కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలను ఆయన హెచ్చరించారు. ప్రజలు కాలుష్యం…
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం గుబులు రేపుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 352గా నమోదైంది. అలాగే ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. అయితే దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత సూచీ మరింత దిగజారే అవకాశముందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా…
కరోనా కారణంగా చాలా కాలంపాటు ఆంక్షలు కొనసాగడంతో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. కాగా, ఆంక్షలను చాలా వరకు ఎత్తివేశారు. రోడ్డుమీదకు వాహనాలు తిరిగి పరుగులు తీస్తున్నాయి. దీంతో వాయుకాలుష్యం తిరిగి మొదలైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 పాయింట్లు దాటడంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ సరిహద్దుల్లో పంట వ్యర్థాల దహనంతో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతున్నది. పంట వ్యర్థాలను…