తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా సొంత ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాలిబన్లు సొంత ఎయిర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయింది. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర మిలిటెండ్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. వీటికి బుద్దిచెప్పేందుకు ల్యాండ్ పై నుంచి మాత్రమే కాకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఆగడాలు తగ్గిపోతాయని తాలిబన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. గతంలో ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన సైనికులు, అధికారులు తిరిగి వస్తే ఎయిర్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని తాలిబన్ ప్రభుత్వం చెబుతున్నది. కాగా, తాలిబన్ ఎయిర్ ఫోర్పాటు విషయం అంశాన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించలేదు.
Read: లైవ్: సీఎం కేసీఆర్ మీడియా సమావేశం