ఒకప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు మధ్య వయస్సు దాటితే కాని కనిపించేవి కాదు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. స్కూలుకెళ్లే పిల్లలు కూడా కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు. ఇందుకు కారణం మయోపియా అని డాక్టర్లు చెబుతున్నారు. అంటే హ్రస్వదృష్టి. ఇలాంటి కండిషన్ ఉన్నవారిలో కనుగుడ్డు ఉండాల్సిన దానికంటే పొడవుగా ఉంటుంది. దాంతో సరిగ్గా రెటీనా మీద కేంద్రీకృతం (ఫోకస్) కావాల్సిన కాంతికిరణాలు... రెటీనాకు కాస్త ముందే కేంద్రీకృతమవుతాయి.