Asaduddin Owaisi: కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ముస్లిం జేఏసీ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీపై మాట్లాడిన ఒవైసీ, ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింల ద్రోహి. ఆయన పాలనలో ముస్లింల పట్ల అన్యాయం ఎక్కువైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే…
భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపిందన్నారు. ఉగ్రవాద దేశం వల్ల మేము చాలా మంది అమాయక ప్రాణాలను కోల్పోయామని పేర్కొన్నారు. ఈ సమస్య పాకిస్తాన్ నుంచి మాత్రమే ఉద్భవిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ ఈ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడంఆపివేసే వరకు ఈ సమస్య తొలగిపోదని ఒవైసీ అన్నారు.
Asaduddin Owaisi: AIMIM పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ఉగ్రవాదంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంపై జిహాద్ పేరిట హత్యలు చేయాలని పాకిస్తాన్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని, పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించిన లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)పై అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అన్నారు. Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్‌కి దెబ్బ, చైనాకు…
ఈ సమావేశం ముగిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఒవైసీ.. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న మన సాయుధ దళాలను మరియు ప్రభుత్వాన్ని నేను అభినందించాను. రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) కు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని నిర్వహించాలని కూడా నేను సూచించాను అన్నారు.. TRFని ఉగ్రవాద సంస్థగా పేర్కొనమని భారత ప్రభుత్వం.. యూఎస్ఏని కోరాలని కూడా నేను సూచించాను. FATFలో పాకిస్తాన్‌ను గ్రే-లిస్ట్ చేయడానికి కూడా మనం ప్రయత్నాలు చేయాలని స్పష్టం చేశారు..
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది.. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మరో రెండు, మూడు గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.. మొన్న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి నిఘా వైఫల్యమే కారణమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని ఊచకోతగా ఆయన అభివర్ణించారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఇది ఉరి ప్రాంతం, పుల్వామా సంఘటనల కంటే ప్రమాదకరమైందని, బాధాకరమైందన్నారు. ఈ సంఘటనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాని డిమాండ్ చేశారు.
Konda Vishweshwar Reddy : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు ముదురుతున్నాయి. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి AIMIM, కాంగ్రెస్, BRS పార్టీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. BBP అనే కొత్త పదాన్ని విపక్షాలకు ఆయన బిరుదుగా ఉపయోగించారు. BBP అంటే భాయ్ భాయ్ కే పార్టీ, బాప్ బేటే కే పార్టీ, బాప్ భేటి కి పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇవన్నీ AIMIM, కాంగ్రెస్, BRSలకే సూచిస్తాయని ఎద్దేవా చేశారు.…
Bandi Sanjay : పెద్దపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్థలంలో దారుసలామ్ మీటింగ్ పెట్టడం అన్యాయమే కాదు, పేద ముస్లింలకు గుణపాఠం చెబుతోందని మండిపడ్డారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పేద ముస్లింల పొట్ట కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. వక్ఫ్ బిల్లును పేద ముస్లింల కోసం తీసుకువచ్చినట్లు చెప్పిన సంజయ్, “బడాబాబులు, బడా చోర్లు కలిసి హైదరాబాద్‌లో…
Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి డూప్లికేట్ గాంధీ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లను లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శల వర్షం కురిపించారు. “భారతదేశ రాజ్యాంగానికి అతీతులా? చట్టాలు వీరికి ఎందుకు వర్తించకూడదు?” అని సంబరపడ్డారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దోచుకునేందుకు యంగ్ ఇండియా సంస్థ పేరుతో 50 వేల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కుట్రలో ఈ కుటుంబం మునిగిపోయిందని…