Asaduddin Owaisi: ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్, ఓ కేసులో శ్రీ మహా విష్ణువు గురించి వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలనే పిటిషన్‌పై..‘‘ మీరు విష్ణువు భక్తులు కదా, విష్ణువునే ఏమైనా చేయమని అడగండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం రాకేష్ అనే 70 ఏళ్లకు పైబడిన న్యాయవాది కోర్టు హాలులో సీజేఐ బీఆర్ గవాయ్‌పై షూతో దాడికి పాల్పడ్డాడు. అయితే, సీజేఐ ఆదేశాల మేరకు, ఢిల్లీ పోలీసులు అతడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
Read Also: Illicit affair: అత్తతో అక్రమ సంబంధం.. భార్య హత్య..
అయితే, ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ కేసులో రాకేష్ కాకుండా, షూ విసిరిన వ్యక్తి పేరు ‘‘అసద్’’ అయి ఉంటే పోలీసులు ఇలాగే స్వేచ్ఛగా వెళ్లనిచ్చేవారా..? అని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదు… ఎందుకంటే అతని పేరు రాకేష్ కిషోర్’’ అని ఓవైసీ అన్నారు. ‘‘అతని పేరు రాకేష్ కాదు, ‘అసద్’ అయితే, ఢిల్లీ పోలీసులు ఏమి చేసేవారు?’’ అని అడిగారు.
‘‘భారత ప్రధాన న్యాయమూర్తి కులం ప్రకారం దళితుడు. నేను నా దళిత సోదరుల్ని అడగాలని అనుకుంటున్నాను. ఒక వ్యక్తి కోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై షూ విసిరాడు. ఏం జరుగుతోంది..?. నేరస్తుడు భారతదేశం సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించదు. కానీ ప్రధాన న్యాయమూర్తి పై షూ విసిరేసే ధైర్యాన్ని అతడికి ఎలా వచ్చింది.?’’ అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారని అడిగారు. ఢిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు, యూఏపీఏ చట్టాలను ఎందుకు ప్రయోగించలేదు..? నిందితుడు ఒక వేళ అసద్ అయితే, అతడిని పాకిస్తాన్ తో ముడిపెట్టే వారు అని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.