ఏఐఏడీఎంకే నేత ఇ.పళనిస్వామికి మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకం చెల్లదని హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. పళనిస్వామితో తీవ్ర అధికార పోరులో చిక్కుకున్న ఓ పన్నీర్‌సెల్వంకు ఈ తీర్పు తీపికబురుగా మారింది. పార్టీ నాయకత్వం విషయంలో జూన్ 23కి ముందు ఉన్న స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
AIADMK interim general secretary K Palaniswami on Thursday expelled O Panneerselvam's sons, and 16 other supporters of the ousted leader, from the party.
అన్నాడీఎంకేలో జయలలిత మరణం తర్వాత వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు బలమైన నేతలుగా ముద్రపడ్డ పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారే నంబర్‌వన్ అవ్వాలన్న కాంక్ష వీరి మధ్య దూరాన్ని పెంచింది. తాజాగా అదును చూసి పన్నీర్ సెల్వంను పళనిస్వామి దెబ్బకొట్టారు. సోమవారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికయ్యారు. మరోవైపు పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి…
అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు ముదిరింది. పార్టీ అధినేత పదవి కోసం మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగిల్ లీడర్‌షిప్ ప్రతిపాదనపై ఈరోజు అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి ముందే చెన్నైలో పన్నీర్, పళని వర్గాల నేతలు రోడ్డుపైనే కొట్టుకున్నారు. అంతేకాకుండా చెన్నైలోని అన్నా డీఎంకే ఆఫీసులోకి చొరబడి తలుపులు బద్దలు కొట్టారు. జయలలిత కట్టించిన ఈ ఆఫీస్‌లో ఈరోజు పన్నీర్ సెల్వం, పళనిస్వామి…
తమిళనాడులో ఎన్నికల వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న మున్సిపల్ పోరు జరుగుతోంది. తమిళనాట మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొత్తం 21 కార్పొరేషన్లు, 130 మునిసిపాలిటీలు, 490 నగర పంచాయతీలకు ఒకే దశలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. బరిలో ఏఐఎడీఎంకే, డీఎమ్‌కే, నటుడు విజయ్ సంబంధించిన మక్కల్ ఇయాక్కం పార్టీలు తలపడుతున్నాయి. సాలిగ్రామం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. నీలాంగరి పోలింగ్ బూత్…
దేశంలో ఐదురాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి19న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ. గతంలోలాగే అన్నాడీఎంకే తమ మిత్రపక్షమే అనీ, తమ బంధం అలాగే ఉంటుందని తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం సీట్లు ఇచ్చేందుకు ఏఐఏడీఎంకే నాయకత్వం ముందుకు వచ్చిందని, అయితే..తమకు ఎక్కువ…
తమిళనాడులో డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటి కరప్షన్ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి… ఇవాళ ఉదయం అన్నా డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి తంగమణి ఇళ్లు, కార్యాలయాలు, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటి కరప్షన్ (డీవీఏసీ) అధికారులు.. అవినీతి సొమ్మును క్రిప్టో కరెన్సీలలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టినట్టుగా సమాచారం అందుకున్న అధికారులు.. ఇప్పటికే ఆయనపై కేసులు నమోదు చేశారు.. Read Also:…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శశికళ భేటీ అయ్యారు. రజనీకాంత్ తో ఆయన భార్య లత కూడా వున్నారు. రజనీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఐడీఎంకె లో పార్టీ పదవుల పంపకం వేళ రజనీకాంత్ తో భేటీ అయ్యారు శశికళ. రెండు రోజుల క్రితం పార్టీ కోఆర్డినేటర్ పదవికోసం నామినేషన్ దాఖలు చేశారు ఈపీఎస్, ఓపిఎస్. ఏకగ్రీవంగా ఎన్నికలకు వీరిమధ్య సయోధ్య కుదిరింది. పార్టీ బాధ్యతలు ఓపిఎస్ కు ఇచ్చేందుకు ఈపీఎస్ అంగీకరించారు. ఈనేపథ్యంలో రజనీకాంత్‌తో…
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే 50 వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నమ్మ శశికళ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అటు మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్ సెల్వం, పళనీ స్వామి పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని నడిపించాలని చూస్తున్నారు. అయితే, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శశికళ ఇప్పుడు మరలా రాజకీయాల్లో రాణించేందుకు…