ఇటీవలి రోజుల్లో త్రిష కృష్ణన్‌ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆ మధ్య త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డానంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పలువురు సెలబ్రిటీలు మన్సూర్‌పై మండిపడ్డారు. అతడిని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేశారు. త్రిష చట్టపరంగా వెళ్లడంతో ఆమెకు మన్సూర్ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా త్రిషపై అన్నాడీఎంకే లీడర్ ఏవీ…
తమిళ సినీ నటి గౌతమి (Tamil actor Gautami Tadimalla) అన్నాడీఎంకే గూటికి (AIADMK) చేరారు. మాజీ ముఖ్యమంత్రి పళినిస్వామి (Palaniswami) సమక్షంలో ఆమె రెండు ఆకుల పార్టీలోకి చేరారు.
Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన కొత్త మూవీ లియోపై తమిళనాడులో పొలిటికల్ వివాదం రాజుకుంది. దీనిపై అధికార డీఎంకేపై ఏఐడీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో ఏఐడీఎంకే ప్రభుత్వంలో సమాచార, ప్రచార మంత్రిగా పనిచేసిన కదంబూర్ రాజు డీఎంకేని విమర్శించారు. లియో షో టైమింగ్స్ పై ఆంక్షలు విధించినందుకు డీఎంకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి (NDA) నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రత్యేక ఫ్రంట్‌ను సిద్ధం చేయడం గురించి ఆ పార్టీ మాట్లాడుతోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కీలక ప్రకటన చేశారు.
తమిళనాడు రాజకీయల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ఓపీ రవీంద్రనాథ్‌కు మద్రాసు హైకోర్ట్ షాక్ ఇచ్చింది. తేనీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో ఆయన ఎన్నికను హైకోర్టు క్యాన్సిల్ చేసింది. పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌కు ఎదురుదెబ్బ తగలినట్లైంది.
తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఏంకే, బీజేపీ మధ్య వివాదంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోదని ప్రచారం జరుగుతోంది. ఏఐఏడీఎంకే-బీజేపీ మధ్య విభేదాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమికి కూటమికి బీటలువారనున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశం అయినట్లు సమాచారం.
తమిళనాడులోని అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) కార్యదర్శి పదవికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్ కమిషన్ అంగీకరించింది. ఈ విషయంలో ఇప్పటికే మద్రాస్ హైకోర్టు సైతం తీర్పు వెలువరించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమిళనాడుకు చెందిన సీనియర్ నేత ఓ.పన్నీర్ సెల్వం మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 13న జరగనుంది.మొత్తం 224 నియోజకవర్గాలున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది.
తమిళనాడులో మిత్రపక్షాలుగా ఉన్న విపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలతో పొత్తుకు బీటలు వారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.