దేశంలో ఐదురాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి19న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ.
గతంలోలాగే అన్నాడీఎంకే తమ మిత్రపక్షమే అనీ, తమ బంధం అలాగే ఉంటుందని తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం సీట్లు ఇచ్చేందుకు ఏఐఏడీఎంకే నాయకత్వం ముందుకు వచ్చిందని, అయితే..తమకు ఎక్కువ స్థానాలు కావాలని కోరామన్నారు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై.
చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం కమలాలయమ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, స్మార్ట్ సిటీ మిషన్ వంటి వాటితో ప్రజల్లోకి వెళ్లేందుకు స్థానిక ఎన్నికలు మంచి అవకాశంగా భావిస్తున్నామన్నారు. నిలవాలని నిర్ణయించాం. తమిళనాడు మొత్తం అభ్యర్థులను పోటీలో నిలబెడతామన్నారు అన్నమలై.
ఈ స్థానిక పోరులో ఎక్కువ సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేతో తమ బంధం కొనసాగుతుందని, 2024 లోక్సభ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని చెప్పారు. మరి ఒంటరిపోరు బీజేపీకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.