తమిళ సినీ నటి గౌతమి (Tamil actor Gautami Tadimalla) అన్నాడీఎంకే గూటికి (AIADMK) చేరారు. మాజీ ముఖ్యమంత్రి పళినిస్వామి (Palaniswami) సమక్షంలో ఆమె రెండు ఆకుల పార్టీలో చేరారు. కొద్ది కాలం క్రితమే ఆమె బీజేపీకి గుడ్‌బై చెప్పారు. కమలనాథులు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని గౌతమి ఆరోపించారు. తాజాగా ఆమె అమ్మ (జయలలిత) పార్టీలో చేరారు.
ఇదిలా ఉంటే త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అన్నాడీఎంకేలో చేరినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతోనే ఆమె పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ అన్నాడీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
మరోవైపు హీరో విజయ్ కూడా తమిళనాడులో కొత్త పార్టీని స్థాపించారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు.
Tamil actor Gautami Tadimalla joined AIADMK and met the party's general secretary Edappadi K Palaniswami in Chennai today
(Photo source: AIADMK) pic.twitter.com/UVSwUGHUHb
— ANI (@ANI) February 14, 2024