ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్ కారక జన్యువులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) టూల్ అందుబాటులోకి రానుంది. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూపొందించిన ఈ పరికరాన్ని పివోట్ (PIVOT) అని పేర్కొంటారు. దీని సాయంతో ఏ పేషెంట్‌లో ఏ జన్యువు కారణంగా క్యాన్సర్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ఫలితంగా వ్యక్తి స్థాయి చికిత్స విధానాన్ని డెవలప్ చేయొచ్చు. ఇప్పటివరకు ఒకే రకమైన క్యాన్సర్ రోగులకు ఒకే విధమైన ట్రీట్మెంట్ చేసేవారు. పివోట్‌తో ఈ పద్ధతిలో మార్పు రానుంది.…