ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రైతాంగం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఉచిత పంటల బీమా పథకం రాష్ట్రంలో నవ్వులాటగా మారింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 98 శాతం కట్టగా 2 శాతం మాత్రమే రైతు కట్టే ఈ పథకాన్ని అటకెక్కించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇన్స్యూరెన్స్ (పంటల బీమా) రైట్ యాక్టు లేకుండా చేసింది. రైతుల హక్కులను జగన్ ప్రభుత్వం కాల రాసింది. 2020నుంచి కూడా…
పోడు భూముల లొల్లిఎటూ తెగడం లేదు. భూమే తమకు ఆధారం అని ఆదివాసీలంటుంటే అసలు అక్కడ పోడు భూమే లేదంటున్నారు అటవీశాఖ అధికారులు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తిరిగొచ్చాక సైతం ఆదివాసీలు భూమి కోసం ఆరాటపడుతుంటే అధికారులు అది కవ్వాల్ టైగర్ జోన్ అంటూ ఖరాకండిగా చెప్పేస్తున్నారు. ఎంత చేసినా ఎట్టి పరిస్థితుల్లో భూమి ఇవ్వబోమని అటవీశాఖ తేల్చి చెబితే.. .తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వదల బోమంటున్నారు ఆదివాసీలు..మంచిర్యాల జిల్లా కోయపోష గూడెంలో…
తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న శక్తులు ఇంకా తెలంగాణలోనే ఉన్నాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ శక్తులే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అన్నారు. దేశంలో 58 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని.. డబ్బను పుట్టించడం మళ్లీ ఆ డబ్బును ఖర్చు అయ్యేలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మెరగుపడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయం ద్వారానే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెద్ద పీట వేశారని అన్నారు. రూ. 2 కిలో బియ్యం…
తెల్లబంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది. పత్తి ని తెల్ల బంగారం అన్నది మాటల్లోనే కాదు…వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారం లా మెరిసిపోతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రోజురోజుకీ పత్తి ధర పెరుగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా పత్తి ధర హవా కొనసాగుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. పత్తి, వేరుశనగ పంట పెద్ద ఎత్తున ఆదోని మార్కెట్ కు…
ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై…
శ్రీలంకను సంక్షోభం కుదిపేస్తోంది. రాజకీయ ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య దేశ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు శ్రీలంక మాజీ అధ్యక్షుడు, శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్వహించిన మేడే ర్యాలీలో ఆయన కీలక ప్రకటన చేశారు. దేశంలో కొత్తగా ఎన్నికలు జరపాలన్నారు. ఎన్నికలే సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. మనుగడకు పోరాటం చేస్తున్న ప్రజల్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి. రాజకీయ నాయకులు ప్రజల…
తెలంగాణలో వరి ధాన్యం విషయంలో నిన్నమొన్నటివరకూ మాటల యుద్ధం నడిచింది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతలు రాజకీయంగా విమర్శలు చేసుకున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని చెప్పడంతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైస్ మిల్లులపై ఏకకాలంలో FCI (Food Corporation Of India) అధికారులు దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలోని 3278 మిల్లుల్లో 2020-21 వానాకాలం, యాసంగి సీజన్ల నిల్వలపై ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం…
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. రూ.15 వేల కోట్ల కు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అందిస్తున్నాం. చంద్రబాబు ఆరు ప్రాజెక్టులు కావాలని కేంద్రాన్ని అడిగారు. పోలవరానికి రూ 55 వేల కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ 70 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అందించిందన్నారు సోము వీర్రాజు. రాయలసీమ నుంచి అమరావతి కలిపేందుకు ఆరు లైన్లు, 4 లెన్లతో జాతీయ రహదారి నిర్మాణం చేయబడుతున్నామని చెప్పారు. కడప, కర్నూల్…
ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశలేదు. కొందరు కేటుగాళ్ళ కారణంగా అన్నదాతలకు అగచాట్లు తప్పడంలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాలపై నకిలీ విత్తనాలు పంజా విసురుతున్నాయి. అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టేశారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచివస్తున్నాయో తెలీడం లేదు. ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల…
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. గతంలో వానాకాలం పంటలపై ఈసారి ఎలాంటి ఆంక్షలు విధించబోమన్నారు. వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా వుంటాయని మంత్రి తెలిపారు. రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఇతర పంటల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. వానకాలం పంటలపై ఆంక్షలు పెడుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వరిపై ఆంక్షలు లేవని, లాభసాటి…