ఏపీలో విద్యుత్ కష్టాలు జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పరిశ్రమలకు కూడా ఇక్కట్లు పాలవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యుత్ శాఖపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పరిస్థితి.. అదనపు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలపై చర్చించారు. అదనంగా మరో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలిచ్చారు. కృష్ణపట్నం, ఎన్టీటిపిఎస్సులల్లో 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్లను వినియోగించుకోవాలని సూచన.హైడెల్ ప్లాంట్ల ద్వారా మరో 6000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు అధికారుల వెల్లడి.మే ఒకటి…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు… దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.. రైతులు నెలల తరబడి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగారు.. దీంతో.. కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే, ఈ చట్టాలపై సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక బహిర్గతమైంది. సాగు చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నందున… వాటిని రద్దు చేయవద్దంటూ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీయడంతో.. వీటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈ…
వేసవి ప్రారంభానికి ముందే తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. వినియోగంలో ఆల్‌టైమ్ రికార్డు త్వరలో నమోదుకానుందని విద్యుత్ వర్గాలు చెబుతున్నాయి. దింతో కరెంట్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కసరత్తు మొదలుపెట్టారు. తెలంగాణలో కరెంటు డిమాండ్ ఆల్ టైమ్ రికార్డుకు దగ్గర్లో ఉంది. గత ఏడాది మార్చి చివర్లో 13 వేల 688 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ను అధిగమించింది. అయితే గతేడాది మార్చి 4న అత్యధికంగా నమోదైన విద్యుత్ డిమాండ్.. ఈ ఏడు ఇప్పటికే అధికమించింది. ఈనెలాఖరులోగా…
మహిళలు ఇప్పుడు క్రమంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. కానీ, గతంలో మహిళలు వ్యవసాయ రంగానికే పరిమితం అయ్యారు.. మహిళా రైతులు, మహిళా కూలీలు.. ఇలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.. తమకు ప్రతీకూల పరిస్థితులు ఎదురై.. ఇంట్లో వ్యవసాయం చేసేవారు లేకపోతే.. తాము సైతం అంటూ నడుం కట్టి వ్యవసాయం చేసేవారు ఎంతో మంది ఉన్నారు.. తాజా గణాంకాల ప్రకారం గ్రామీణ భారతదేశంలో, దాదాపు 84 శాతం మంది మహిళలు జీవనాధారం కోసం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని..…
ఏపీలో సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జిల్లా, కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పని తీరును సమీక్షించారు. కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం కాపాడుకోవాలి. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. వెసులుబాటు ఉన్నంత…
జగన్ పాలనపై మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతు దుష్మన్ ప్రభుత్వంగా మారిందన్నారు. సి.ఎం జగన్ మోహన్ రెడ్డి 32 నెలల కాలంలో వ్యవసాయ, సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వ్యవసాయ,సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని తులసిరెడ్డి మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వలేక చేతులు ఎత్తేశారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో…
రాష్ట్రంలో అమలవుతున్న ఉపాధి హామీ పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వ్యవసాయానికి కూలీలు వెళ్లకూడదు అనేట్లు NREGS పథకాన్ని అమలు చేస్తే రైతులు బ్రతకరు అన్నారు ధర్మాన. ఈ విధంగా పథకాల రూపకల్పన దేశ నాశనానికి దారి తీస్తాయి. రెండు గంటలు పనికి డబ్బులు వేసేస్తుంటే.. ఓ పూట పని ఉండే వ్యవసాయానికి ఎందుకు వస్తారు ? ఇలాంటి పోరంబోకులను తయారు చేసే పద్దతి వ్యవసాయానికి దెబ్బ. రైతులకు ఏమైనా ఫర్వాలేదనే…
రైతులను వదిలేసే ప్రభుత్వం తమది కాదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. శుక్రవారం గుంటూరులోని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటిలోని అగ్రిటెక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రాప్ ద్వారా నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చిపంటపై నివేదిక తెప్పిస్తామన్నారు. Read Also: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఎన్జీటీ కీలక తీర్పు వ్యవసాయ, ఉద్యానశాఖ వీసీలతో పాటు సైంటిస్టులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నల్ల…
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య 42.5 శాతం నుంచి 45.6 శాతానికి పెరిగినట్లు గురువారం రాజ్యసభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ జూలై 2019 నుంచి జూన్ 2020 మధ్య నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) నిర్వహించిన కార్మిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్యలో పెరుగుదల కనిపించగా, అదే కాలంలో తయారీ రంగంలో కార్మికుల సంఖ్య 12.1 శాతం…
వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ… పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి,భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చేసింది. కనీస మద్దతు ధర (ఎంఎస్పి) పై స్వయంగా ప్రధానమంత్రి, తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. రైతు ప్రతినిధుల్లో ఎస్కేఎంల ప్రతినిధులను కూడా చేర్చుకుంటామని స్పష్టం చేసింది. అలాగే దేశంలోని రైతులకు ఎంఎస్పి ఇవ్వాలన్నది కమిటీ…