తెలంగాణలో వరి ధాన్యం విషయంలో నిన్నమొన్నటివరకూ మాటల యుద్ధం నడిచింది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతలు రాజకీయంగా విమర్శలు చేసుకున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనని చెప్పడంతో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రైస్ మిల్లులపై ఏకకాలంలో FCI (Food Corporation Of India) అధికారులు దాడులు చేస్తున్నారు.
రాష్ట్రంలోని 3278 మిల్లుల్లో 2020-21 వానాకాలం, యాసంగి సీజన్ల నిల్వలపై ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం రంగంలోకి దిగిన ఫుడ్ కార్పోరేషన్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గత ఏడాదికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సి ఉన్నాయి రైస్ మిల్లులు. ఎఫ్ సీఐ ఇచ్చిన గడువు ముగియడంతో తనిఖీలు చేపట్టారు అధికారులు.
రాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించిన తనిఖీల్లో రైస్ మిల్లుల బాగోతం బయటపడింది. రాష్ట్రం నుంచి ఎఫ్ సి ఐకి 5.50లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ బకాయిలు వున్నాయి. ఈ తనిఖీల అనంతరం ఎఫ్ సి ఐ అధికారులు రైస్ మిల్లులపై చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలోని శివరామకృష్ణ రైస్ మిల్లులో ధాన్యం నిల్వలపై ఎఫ్ సీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు.
KTR On Modi: మోడీ పాలనపై కేటీఆర్ ట్వీట్ అస్త్రాలు