ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్ లో భాగంగా.. నిన్న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ పేసర్ అరుంధతి రెడ్డిని ఐసీసీ మందలించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు అరుంధతి దోషిగా తేలింది.