పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పై దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన వారిలో కంపెనీ కీలక ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కు చెందిన ప్రసాదిత్యా కంపెనీతో మాలికి చెందిన డైమండ్ ఫ్యాక్టరీకి పార్టనర్ షిప్ ఉంది.