Pension for 66years : తన జీవితంలో 66ఏళ్ల పాటు ప్రభుత్వం నుంచి పింఛన్ అందుకున్న వ్యక్తి కన్నుమూశాడు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన.. 66 ఏండ్లకు పైగా పెన్షన్ అందుకున్నారు.
Floods kill at least 120 in DRC capital Kinshasa: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ఆఫ్రికా దేశం అతలాకుతలం అవుతోంది. కాంగో రాజధాని కిన్షాసాలో రాత్రంతా కురిసిన వర్షం వల్ల చరిత్రలో ఎప్పుడూ లేని వరదలు వచ్చాయి. దీంతో జనజీవితం స్తంభించిపోయింది. దాదాపుగా 1.5 కోట్ల జనాభా ఉన్న కన్షాసా వరదల వల్ల దెబ్బతింది. నగరంలోని ప్రధాన రహదారులు మునిగిపోయాయి.…
Gunmen kill 12, including imam, abduct others from mosque in Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారు. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఇమామ్ తో సహా 12 మంది మరణించారు. మరికొంత మంది కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నైజీరియా కట్సనా రాష్ట్రంలో జరిగింది. ఇది ప్రెసిడెంట్ మహ్మద్ బుహరీ సొంత రాష్ట్రం.
14 killed in two attacks in Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. రెండు వేర్వేరు దాడుల్లో కనీసం 14 మంది మరణించారు. చనిపోయిన వారిలో 8 మంది సైన్యానికి చెందిన వారు ఉన్నారు. సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదుల ఈ దాడులకు పాల్పడ్డారు. సఫీ గ్రామంలో జరిపిన దాడుల్లో ఎనిమిది మంది వాలంటీర్స ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ ఫాదర్ ల్యాండ్ కు చెందిన వారు ఉన్నారు. వీరంతా సైన్యానికి…
Over 1,000 zebras, elephants and wildebeest die after Kenya drought: ఆఫ్రికాదేశం కెన్యాలో కరువు తాండవిస్తోంది. అక్కడి ప్రజలతో పాటు వన్య ప్రాణులు కరువుబారిన పడి అల్లాడుతున్నాయి. కెన్యాలో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వన్య ప్రాణులు కరువు దెబ్బకు వేలాదిగా చనిపోతున్నాయి. ఇప్పటి వరకు 512 వైల్డ్ బీస్ట్, 381 జీబ్రాలు, 205 ఏనుగులు, 49 గ్రేవీస్ జీబ్రాలు, 51 అడవి బర్రెలు చనిపోయాయని…
Ebola outbreak in Uganda: ఉగాండాలో ఎబోలా కలకలం రేపుతోంది. ఆ దేశంలో వరసగా ఎబోలా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాజధాని కంపాలాలో కొత్తగా 9 ఎబోలా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో మొత్తం 14 కేసులు నమోదు అయ్యయాని అక్కడి ఆరోగ్య మంత్రి సోమవారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో సెంట్రల్ ఉగాండాలోని గ్రామీణ ప్రాంతంలో ఎబోలా వ్యాప్తి ప్రారంభం అయింది. ఈ నెలలో రాజధాని కంపాలాకు ఈ వ్యాధి వ్యాపించింది. 16 లక్షల…
60 killed in anti-government protests in Chad: చాద్ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు మిన్నంటుతున్నాయి. వీటిని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు మహమత్ ఇద్రిస్ డేబీ తన అధికారాన్ని రెండేళ్ల పాటు పొడగించుకోవడాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గురువారం దేశంలోని రెండు అతిపెద్ద నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఎగిసిపడ్డాయి. చాద్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరపడంతో 60 మంది…
MarBurg Virus: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఇంకా పూర్తిగా తగ్గలేదు. మరోవైపు మంకీపాక్స్ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఆఫ్రికా ఖండంలోని ఘనాలో అత్యంత వ్యాప్తి కలిగిన ‘మర్‌బర్గ్’ వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు ఘనా ప్రభుత్వం వెల్లడించింది. వారితో సన్నిహితంగా మెలిగిన 98 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపింది. మృతుల నమూనాలు సేకరించి సెనెగల్‌లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించగా…
The World Health Organisation says Ghana has reported two possible cases of the Ebola-like Marburg virus disease, which if confirmed would mark the first-ever such infections in the West African country.