14 killed in two attacks in Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. రెండు వేర్వేరు దాడుల్లో కనీసం 14 మంది మరణించారు. చనిపోయిన వారిలో 8 మంది సైన్యానికి చెందిన వారు ఉన్నారు. సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదుల ఈ దాడులకు పాల్పడ్డారు. సఫీ గ్రామంలో జరిపిన దాడుల్లో ఎనిమిది మంది వాలంటీర్స్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ ఫాదర్ ల్యాండ్ కు చెందిన వారు ఉన్నారు. వీరంతా సైన్యానికి సహాయకంగా ఉంటారు. 2019లో ఈ దళాన్ని ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. వీరినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేశారు.
Read Also: AWS Hyderabad : హైదరాబాద్‌లో AWS డేటా సెంటర్ క్లస్టర్
ఉత్తర బుర్కినా ఫాసోలోని మార్కోయ్ అనే పట్టణంలో మరో దాడి జరిగింది. ఇందులో ఆరుగులు పౌరులను చంపేశారు టెర్రరిస్టులు. ప్రపంచంలో అత్యంత పేద దేశంగా బుర్కినా ఫాసో ఉంది. 2015లో మాలి నుంచి వచ్చిన జీహాదీ తిరుగుబాటుదారులతో అక్కడి ప్రభుత్వం పోరాడుతోంది. ప్రధానం ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వారు అక్కడ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా సైన్యం పోరాడుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రజలు దేశం వదిలి పారపోయేలా చేసింది. బుర్కినా ఫాసోలో ఈ ఏడాది జనవరిలో సైనిక తిరుగుబాటు జరిగింది. ఎన్నికైన అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్ ను తొలగించింది అక్కడి సైన్యం.