Afghanistan: అఫ్గాన్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: అఫ్గానిస్థాన్ మరోసారి బాంబుదాడులతో హోరెత్తింది. పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్ పట్టణంలో ఓ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 18 మంది మృతి చెందగా.. 23 మంది గాయపడ్డారు. మృతుల్లో ప్రముఖ మత గురువు ముజీబ్ ఉర్ రెహ్మాన్ అన్సారీ కూడా ఉన్నారని తాలిబన్ అధికారులు వెల్లడించారు. బాంబు దాడికి పాల్పడిన నిందితులను శిక్షిస్తామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.
హెరాత్‌లోని గుజర్గా మసీదు.. అఫ్గాన్‌లోని అతిపెద్ద మసీదుల్లో ఒకటి. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సందర్భంగా రద్దీగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దీంతో మసీదు ప్రాంగణం రక్తసిక్తంగా మారింది. ఎక్కడికక్కడ మృతదేహాలు చెల్లచెదురుగా పడ్డాయని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఇప్పటివరకు దాదాపు 18 మంది మృతదేహాలను, 23 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ దాడికి ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదని భద్రతా సిబ్బంది వెల్లడించారు. గతేడాది తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మసీదులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా షియా ముస్లింలే లక్ష్యంగా ఘటనలు జరగడం గమనార్హం.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
Colombia: పోలీసు వాహనంపై బాంబు దాడి.. 8 మంది అధికారులు మృతి
“ముజీబ్ రెహ్మాన్ అన్సారీ తన కాపలాదారులు, పౌరులతో కలిసి మసీదు వైపు వెళుతుండగా చంపబడ్డారు” అని హెరాత్ పోలీసు అధికారి మహమూద్ రసూలీ తెలిపారు. ఆత్మాహుతి బాంబర్లలో ఒకరు తన చేతులను ముద్దుపెట్టుకుంటూ తనను తాను పేల్చేసుకున్నాడని తెలిపారు
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!