Pakistan: పాకిస్తాన్‌కి ఆఫ్ఘానిస్తాన్ పక్కలో బల్లెంలా తయారైంది. ముఖ్యంగా తాలిబాన్‌లు నేరుగా పాక్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. 2021 ఆగస్టులో ఆఫ్ఘానిస్తాన్ లోని ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్ పాలన వచ్చేందుకు పాకిస్తాన్ సహకరించింది. ఆ సమయంలో భారత్-ఆఫ్ఘన్ బంధాన్ని దెబ్బతీశామని పాకిస్తాన్ చాలా ఆనందపడింది. ఇక తాలిబాన్ నాయకులు తాము చెప్పినట్లు వింటారని అనుకుంది.