డబ్బు మాయలో పడి ఎంతటి దారుణాలకైనా తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. ముఖ్యంగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యాలపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విశాఖ నగరంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పూర్ణమార్కెట్ ఏరియాలో నకిలీ నెయ్యి తయారీ డెన్స్ గుర్తించారు. ముఠా లాడ్జి లలో రూమ్స్…
అంతర్జాతీయంగా పూతరేకుల తయారీకి గుర్తింపు పొందిన ఈ ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి వినియోగం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.. ఎంతో ఇష్టంగా తినే పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నారట.. పశువుల కొవ్వు వాడేస్తున్నారట.. కల్తీ నెయ్యి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న వేళ.. ఆత్రేయపురం పూతరేకుల్లోనూ కల్తీ నెయ్యి వినియోగం పెరిగిపోయింది..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని పూతరేకులు తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. కల్తీ నెయ్యితో కొందరు దుకాణదార్లు పూతరేకులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించడం సంచలనంగా మారింది. దాడుల్లో ఎటువంటి బ్రాండ్ లేని 160 కేజీల కల్తీ నెయ్యి సీజ్ చేసి ఎనిమిది షాపులపై కేసులు నమోదు చేశారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూతరేకు స్వీట్ లో కొందరు అధిక లాభాల కోసం కల్తీ నెయ్యిని కలుపుతున్నట్లుగా ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో…
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. దీనిపై విమర్శలు, ఆరోపణల పర్వాలు కొనసాగుతుండగా.. కల్తీ నెయ్యిపై వ్యవహారంపై దర్యాప్తులో వేగం పెంచింది సిట్.. ఏఆర్ డైరీకి సహా గత బోర్డులో కోందరూ బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.. నేడు బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సిట్..