ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోలు ఒకేలాంటి కథలను ఎంచుకోవాలని కోరుకోవడం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని తమలోని నటనను ఇంకా మెరుగుపర్చుకుంటున్నారు. ఇక విభిన్న కథాంశాల హీరోగా పేరుతెచ్చుకున్న హీరో అడవి శేష్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన శేష్.. మంచి మంచి కథలను ఎంచుకొని స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం సెట్స్ మీద ఉండగా.. మరో చిత్రం ‘హిట్ 2’…
ముంబై అటాక్ లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని మే 27న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనే అదే రోజున జనం ముందుకు తమ…
Adivi Sesh New Movie Major Updates. అడివి శేష్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 సంఘటనలో అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మార్చి 15 మేజర్ సందీప్ 45వ జయంతి సందర్భంగా అతని బాల్య స్మృతులను, శిక్షణా రోజులను, తల్లిదండ్రులతో, సోదరితో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తూ ఓ వీడియోను ‘మేజర్’ చిత్ర బృందం రూపొందించి విడుదల చేసింది. సందీప్ జీవితంలోని…
Major అనే ఆసక్తికరమైన సినిమాతో ప్రామిసింగ్ యాక్టర్ అడివి శేష్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటించారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, జిఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు మే 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనాతో పాటు పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన విషయం…
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ భారీ క్లాష్ లకు సిద్ధమవుతోంది. తాజాగా మెగా హీరో ‘మేజర్’ను ఢీ కొట్టబోతున్నట్టుగా ప్రకటించారు. మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో ‘ఉప్పెన’ క్రియేట్ చేశాడు. ఈ బ్లాక్బస్టర్ మూవీతో గుర్తుండిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఇది 100 కోట్ల క్లబ్లో చేరింది. తరువాత ‘కొండపొలం’ సినిమాతో మరో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా “రంగ రంగ వైభవంగా”…
కరోనా పరిస్థితులు నెమ్మదిగా కుదుట పడుతుండడంతో వాయిదా పడిన సినిమాలన్నీ మళ్లీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించగా తాజాగా అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు ఆ సినిమా మేకర్స్. 26/11 ఎటాక్ లో భారత దేశం కోసం ప్రాణాలు అర్పించిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ సినిమా రూపొందుతోంది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకి…
రోజురోజుకు కరోనా విజృభిస్తుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇక ఈ మహమ్మారి వలన చిత్ర పరిశ్రమ కుదేలు అవుతోంది. ఇటీవల థర్డ్ వేవ్ విజృంభిస్తుండడంతో సినిమాలను వాయిదా వేయడం తప్ప మేకర్స్ కి వేరే గత్యంతరం కనిపించడం లేదు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాల నుంచి సాధారణ సినిమాల వరకు చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్ ని మార్చుకున్నాయి. తాజాగా అదే కోవలోకి చేరింది అడవి శేష్ ” మేజర్” శశి కిరణ్…
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన “మేజర్” చిత్రం విడుదల గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి పాటను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. “హృదయమా” అనే సాంగ్ ను ఈరోజు మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు. మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ శ్రావ్యమైన సాంగ్ చాలా రొమాంటిక్ గా, ఉల్లాసంగా ఉంది. లిరికల్ వీడియో సినిమాలోని…
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇండియా, జీ.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్, మరియు a+s మూవీస్ పతాకంపై మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట రిలీజ్ కి ముహూర్తం…
యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో విభిన్న సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న నటులలో ఒకరు. క్షణం, గూడాచారి వంటి సినిమాలతో పరిమిత బడ్జెట్తోనే హిట్ కొట్టి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్ అయిన శేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుతూ తనకు బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ వచ్చిందని స్వయంగా వెల్లడించాడు. “నేను నా నెక్స్ట్ రెండు హిందీ చిత్రాలకు…