యాక్షన్ థ్రిల్లర్ “గూఢచారి” థియేటర్లలో విడుదలై నేటితో సరిగ్గా మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అడివి శేష్ తన ట్విట్టర్ లో “ఈ రోజుతో గూఢచారికి మూడేళ్లు. నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే సినిమా ఇది. ఆగస్టు ఎల్లప్పుడూ నాకు అదృష్ట మాసం కాబట్టి, ఈ నెల చివరిలో నెక్స్ట్ మిషన్ భారీ అప్డేట్! #జి2 ప్రకటన త్వరలో వస్తుంది!” అంటూ ట్వీట్ చేశారు. అడివి శేష్…
అడవి శేష్ ‘మేజర్’ సినిమాకు హిందీలో బంపర్ ఆఫర్ తగిలింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు క్రేజీ ఆఫర్ వచ్చింది. సాటిలైట్ రైట్స్ రూపంలో కోట్లు కొల్లగొట్టింది ‘మేజర్’ సినిమా.అడవి శేష్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న ‘మేజర్’ మూవీ అమర జవాన్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. ఆయన ‘26/11’ ముంబై ఉగ్ర దాడుల్లో దేశాన్ని రక్షిస్తూ ప్రాణ త్యాగం చేశాడు. మేజర్ ఉన్నికృష్ణన్ గా శేష్…
అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘మేజర్’. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం కరోనా…
అడివి శేష్ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ తొంభై శాతం పూర్తయింది. అడివి శేష్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘మేజర్’ సినిమాకి శేష్ స్క్రిప్ట్ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ తిరిగి జూలైలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ, ”’మేజర్’ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేయనున్నామని తెలియజేయేందుకు చాలా సంతోషిస్తున్నాను. గత ఏడాది చిట్కుల్ (హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూరు జిల్లాలో ఓ ప్రాంతం)లో ‘మేజర్’చిత్రీకరణ…
అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా మేజర్. ఈ పాన్ ఇండియా మూవీని గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఎ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఎన్.ఎస్.జీ. కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అడివి శేష్ పోషిస్తున్నాడు. జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళ…
యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమా అప్డేట్లతో తరచూ వార్తల్లో నిలిచే ఈ యంగ్ హీరో తాజాగా లవ్ మేటర్ తో చర్చనీయాంశంగా మారాడు. గతంలో ఈ హీరో ఒక బాలీవుడ్ నటిని ప్రేమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శేష్ వాటిపై స్పందించలేదు. తాజాగా ఆయన తన ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యువ హీరో తాను…
ఫిల్మ్ సెలబ్రిటీస్ పంథా మార్చుకున్నారు. కొవిడ్ 19 సెకండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్ననేపథ్యంలో వారూ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇంతవరకూ తమ సినిమా పబ్లిసిటీకి ఉపయోగించుకున్న సోషల్ మీడియాల మాధ్యమంతో కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. ఆపన్నులను ఆదుకోవడానికి తమ వంతుగా సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారు. అయితే… యువ కథానాయకుడు అడివి శేష్… ఈ పనితో పాటు మరో గొప్ప పని కూడా చేశాడు. హైదరాబాద్ కోఠీ ప్రభుత్వ హాస్పిటల్ లో దాదాపు 300 కొవిడ్…
‘క్షణం, గూఢచారి, ఎవరు’ వంటి డిఫరెంట్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. శశి కిరణ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. 26/11 ముంబై నగరంలో జరిగిన టెర్రర్ ఎటాక్స్‌లో తన ప్రాణాలను పణంగా ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు…
2008 నవంబర్ 26న ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ పై ఉగ్రమూకలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్. అతని జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా సోమవారం సాయంత్రం విడుదలైంది. మేజర్ ఉన్ని కృష్ణన్ ఈ దేశం కోసం ఎలా ప్రాణాలు ధారపోశాడు అనేది కాకుండా… ఎలా ఈ దేశం కోసం జీవించాడు అనే దానిని ఈ…