విభిన్నమైన కథలను ఎంచుకొని వరుస విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన శేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే ‘మేజర్’ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్ 2’ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్’ పార్ట్ 1 లో ‘పాగల్’ హీరో విశ్వక్ సేన్ నటించి మెప్పించగా…
నవతరం కథానాయకుల్లో చాలామంది వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు అడివి శేష్. ఆరంభంలో చిన్న పాత్రల్లోనే అలరించిన అడివి శేష్, ఇప్పుడు హీరోగానూ, అడపా దడపా దర్శకునిగానూ మురిపిస్తున్నారు. కెమెరా ముందు నిలచినా, మెగాఫోన్ పట్టినా, వరైటీగా ఏదో ఒకటి చేయాలని తపిస్తున్నారు శేష్. అందుకు తగ్గట్టుగానే విలక్షణమైన పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నారు. అడివి శేష్ 1985 డిసెంబర్ 17న జన్మించారు. పుట్టింది తెలుగునేలమీదే అయినా పెరిగింది…
అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ చిత్రం వచ్చే యేడాది ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. మూడు భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ మొత్తంగా 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. 75 లొకేషన్లలో షూటింగ్ చేయగా ఎనిమిది సెట్లు ప్రత్యేకంగా నిర్మించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్నారు. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తన హెల్త్ అప్డేట్ గురించి వెల్లడించారు. డెంగ్యూ సోకడంతో ఆయన సెప్టెంబర్ 18న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే శేష్ రక్తంలో ఉన్న ప్లేట్‌లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయని, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని, శేష్ ఆరోగ్యానికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడుతుందని సన్నిహిత వర్గాలు…
అడివి శేష్.. ‘క్షణం’, ‘గూఢచారి’ ‘ఎవరు’ వంటి సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరి హీరోల్లా కాకుండా వినూత్నమైన సినిమాలను తీస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 26/11 ముంబై నగరంలో తాజ్ హోటల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను తాజ్ హోటల్‌లోనే చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేశారట.…