Acid Attack: ఓ ప్రిన్సిపాల్‌పై లేటీ టీచర్ యాసిడ్ దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది.. పాఠశాల ప్రిన్సిపాల్ పై ఓ ఉపాధ్యాయిని యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ లో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రియదర్శిని.. గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్‌లో ఒకటో తరగతి ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది.. ఆమె విద్యార్థులను కొడుతున్నట్లు ప్రిన్సిపాల్ విజయ ప్రకాష్‌కు ఫిర్యాదులు అందడంతో ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించారు. దీనిపై ప్రశ్నించడానికి సోమవారం స్కూల్ కు వచ్చిన ప్రియదర్శిని.. ప్రిన్సిపాల్ విజయ ప్రకాష్‌తో మాట్లాడుతూ వాగ్వాదానికి దిగింది.. ఆ తర్వాత యాసిడ్ తో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రిన్సిపాల్ విజయ ప్రకాష్‌కు తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తుండగా.. గాయపడిన ప్రిన్సిపాల్ ను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఆంధ్రా హాస్పిటల్ కు తరలించారు సిబ్బంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. విద్యార్థుల విషయంలోనే లేడీ టీచర్‌పై ప్రిన్సిపాల్ చర్యలు తీసుకున్నారా? ఇంకా ఏమైనా కారణలు ఉన్నాయా? అసలు యాసిడ్ దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఆ యాసిడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది లాంటి వివరాలపై ఆరా తీస్తున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు..
Read Also: Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు.. వారిని నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వం..!