Tribal Welfare Officer: లంచం కేసులో అరెస్ట్ అయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి అస్వస్థత గురయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా శ్రీకృష్ణ స్థిరాస్తి సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు శివ బాలకృష్ణ భారీగా చెల్లించిన డబ్బులను ఏసీబీ సీజ్ చేసింది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగానే బాలకృష్ణ కేస్ లో బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందించారు.
HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివ బాలకృష్ణ ప్రస్తావించాడు. బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్లకు ఐఏఎస్ అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా పలు దఫాలుగా నగదు రూపంలో చెల్లింపులు జరిపినట్లు వెల్లడించారు. నార్సింగిలోని ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ చేశాడు.
HMDA Siva Balakrishna: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై ఏసీబి కోర్టు విచారణ పూర్తయ్యింది. అన్ని వాదనలు విన్న నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ పై వచ్చే సోమవారం తీర్పు ప్రకటించనుంది.
HMDA Siva Balakrishna: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈకేసులో కస్టడి కన్ఫేషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. కస్టడి కన్ఫేషన్ లో ఒక ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన రావడంతో ..
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టారు. ఈ సందర్భంగా ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ ఎఫ్‌ఐర్, రిమాండ్ రిపోర్టు తదితర పత్రాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల పాటు కస్టడికి అనుమతిస్తూ నిన్న ( మంగళవారం ) ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాళ్టి నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు కస్టడీలో విచారించనున్నారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో దొరికిన ఎలక్ట్రానిక్ వస్తువులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. హైటెక్ హంగులతో తన ఇంటిని డెకరేట్ చేశారు బాలకృష్ణ. అంతేకాకుండా.. అత్యంత ఖరీదైన 200 పైగా పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. అత్యంత ఖరీదైన అంతర్జాతీయ బ్రాండెడ్ కు చెందిన 120 వాచీలు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్, సిల్వర్, ప్లాటినం వాచ్ లను ఏసీబీ సీజ్ చేసింది. ట్యాగ్…
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. హెచ్ఎండీఏలో సంవత్సర కాలంగా బాలకృష్ణ అనుమతులపై విచారణ కొనసాగుతుంది. ఇక, బాలకృష్ణకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది.