ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు ను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధింద్ర వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వర్ రావు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏసీబీ బృందం ఏడు చోట్ల సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగదు, లాండ్ పత్రలు బంగారు వెండి ఆభరణాలు సీజ్ చేసామన్న విషయాలు తెలిపారు. ఏసీపీపై చాలా అభియోగాలు వచ్చాయని చెప్పారు. 17 ప్రపార్టీస్ గుర్తించామని.. 5 ఘాట్కేసర్…
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర ఇంటిలో భారీగా నగదు లభ్యమైంది. ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 60 లక్షల రూపాయల నగదు తోపాటు పెద్ద ఎత్తున వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా ఏసీబీ పన్నిన పన్నాగంలో లంచగొండి సబ్ రిజిస్టర్ పడ్డారు. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ సమయంలో లంచం డిమాండ్ చేయగా సదర వ్యక్తి ఏసీబీని ఆశ్రయించడంతో ఈ దాడులను నిర్వహించింది ఏసీబీ. శుక్రవారం సాయంత్రం ఎసిబి డిఎస్పి సాంబయ్య ఆధ్వర్యంలో ఈ రైడ్ జరిగింది. ఈ రైడులో మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా మహమ్మద్ తోపాటు ఆ ఆఫీసులో పనిచేసే డేటా…
గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణయ్యలను అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ స్కామ్ లో నలుగురు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ రజనీని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జమ్మికుంట తహసీల్దార్ ఆస్తులపై ఏసీబీ కీలక ప్రకటన చేసింది. మార్కెట్ విలువ ప్రకారం 20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
గొర్రెల పంపిణీ అవకతవకల్లో ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు. వారిలో కామారెడ్డి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. గొర్రెల పంపిణీలో…
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతి రెండు రోజుల డ్రామాకు తెర పడింది. నిన్న మధ్యాహ్నం ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఆరోగ్యంగా లేనట్టు రెండు రోజులుగా ఆసుపత్రిలో చేరింది జ్యోతి. ఏసీబీకి పట్టుబడిన వెంటనే అస్వస్థత పేరు చెప్పి ఆసుపత్రిలో చేరిన జ్యోతి.. మొదటగా ఛాతి నొప్పంటూ డ్రామాలు ఆడింది. దీంతో హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో నార్మల్ గా…
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15 కోట్ల మేర అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు అధికారులు తేల్చారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. కోటిన్నర రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. ఫ్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. అరెస్ట్ అనంతరం ఆమెను…