హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఇంట్లో దొరికిన ఎలక్ట్రానిక్ వస్తువులను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. హైటెక్ హంగులతో తన ఇంటిని డెకరేట్ చేశారు బాలకృష్ణ. అంతేకాకుండా.. అత్యంత ఖరీదైన 200 పైగా పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. అత్యంత ఖరీదైన అంతర్జాతీయ బ్రాండెడ్ కు చెందిన 120 వాచీలు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్, సిల్వర్, ప్లాటినం వాచ్ లను ఏసీబీ సీజ్ చేసింది. ట్యాగ్ హ్యూయర్, రొలెక్స్, రాడో, ఫాసిల్, టిసాట్ బ్రాండెట్ హ్యాండ్ వాచ్ లు స్వాధీనం చేసుకున్నారు. కాగా..
120 వాచ్ ల విలువ దాదాపు రూ. 32లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాటితో పాటు.. 30కి పైగా ఆపిల్ ఫోన్స్, 31 ఆపిల్ ట్యాబ్స్ స్వాధీనం చేసుకున్నారు. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Bihar Politics: బీహార్ సంక్షోభంపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. తీగలాగితే డొంక కదులుతోంది. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌజ్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్ లో ఫ్లాట్, శేరిలింగంపల్లిలో అధితలో ఫ్లాట్, మల్కాజిగిరి, చేవెళ్లలో ప్లాట్స్, నాగరకర్నూల్ లో 12.13ఎకరాలు, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్ లో భూములు, ప్లాట్స్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అంతేకాకుండా.. 90 ఎకరాల ల్యాండ్ పత్రాలు సీజ్ చేశారు అధికారులు.
Read Also: Kerala: గవర్నర్ వర్సెస్ సీఎం.. ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కి Z+ భద్రత..
గత ఏడాది కూడా హైదరాబాద్ శివారులలో 1,2 లక్షలకు ఎకరం చొప్పున బాలకృష్ణ ల్యాండ్ కొనుగోలు చేశారు. హైదరాబాద్ శివారులో ఎకరా కనీసం మూడు కోట్లు పలుకుతుంటే బాలకృష్ణ లక్ష రూపాయలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కాగా.. ఏసీబీ అధికారుల తనిఖీలలో తన ఇంటిలో 99 లక్షల రూపాయల నగదు, బ్యాంకు బాలెన్స్ 58 లక్షలు ఫ్రీజ్ చేశారు. అంతేకాకుండా.. బాలకృష్ణ ఆస్తుల విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బాలకృష్ణను తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరుతోంది.