HMDA Siva Balakrishna: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈకేసులో కస్టడి కన్ఫేషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. కస్టడి కన్ఫేషన్ లో ఒక ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన రావడంతో ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలు, ఆస్థులు అంటూ శివబాకృష్ణ స్టేట్మెంట్ ఇవ్వడం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 1000 కోట్ల విలువైన ఆస్తులు ఏసీబి గుర్తించింది. 214 ఎకరాలు భూములు గుర్తించింది. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. శివ బాలకృష్ణ తోళపాటు ఇతర అధికారుల పాత్ర పై ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ బినామీలపై ఏసీబి దర్యాప్తు కొనసాగుతుంది. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. కేసు వివరాల సేకరణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొనసాగుతున్నాయి. సోదరుడు నవీన్ అదుపులో తీసుకున్న అధికారులు మరో ఇద్దరి అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. బెయిల్ పిటిషన్ ఫై నేడు విచారణ కొనసాగనుంది.
Read also: Prabhas: మరోసారి పవర్ హౌజ్ కాంబో? ‘శౌర్యాంగ పర్వం’ కాదు అంతకు మించి…
అయితే.. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు నజర్ పెట్టిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఈడీ, ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉంది. శివ బాలకృష్ణ ఎఫ్‌ఐర్, రిమాండ్ రిపోర్టు తదితర పత్రాలను ఇవ్వాలని ఏసీబీకి ఈడీ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. మనీలాండరింగ్ కోణంలోను శివ బాలకృష్ణను ఈడీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. మరోవైపు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బినామీ ఆస్తులపై కూడా ఐటీ అధికారులు విచారణ చేయనున్నారు. ఇక, అధికారాన్ని అపయోగించుకుని హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో ఈ ఆస్తుల విలువ నాలుగు రెట్లు ఉండే ఛాన్స్ ఉంది. ఈ కేసులో శివ బాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.
Sukumar : “పుష్ప 2” మూవీ అంచనాలకు మించి ఉంటుంది..