హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగానే బాలకృష్ణ కేస్ లో బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేశారు. బీనామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణికి నోటీసులు అందించారు. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు విచారణకు హాజరు కావాలని ముగ్గురికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అయితే, శివ బాలకృష్ణ ఆస్తుల లావాదేవీలు నిలిపివేయాలని కలెక్టర్ కి ఏసీబీ లేఖ రాసింది.
Read Also: JD Lakshmi Narayana: ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంగా మారాలి..!
ఇక, శివ బాలకృష్ణ కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు, సోదాల్లో దొరికిన పత్రాలు ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఏసీబీ కస్టడీలో ఉన్న శివ బాలకృష్ణ వెల్లడించిన ఐఏఎస్ అధికారి విషయంలో చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని సదరు ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఏసీబీ రెడీ అవుతుంది. అయితే, శివ బాలకృష్ణ ఆస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరిట ఉన్నట్లు గుర్తించారు. 2021 నుంచి 2023 లోనే కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. యాదాద్రి జిల్లాలో శివ బాలకృష్ణకు 57 ఎకరాల భూమి ఎలా వచ్చింది అనే దానిపై ఏసీబీ అధికారులు విచాణ చేస్తున్నారు.