HMDA Siva Balakrishna: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై ఏసీబి కోర్టు విచారణ పూర్తయ్యింది. అన్ని వాదనలు విన్న నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ పై వచ్చే సోమవారం తీర్పు వాయిదా వేసింది. శివ బాలకృష్ణ బెయిల్ మంజూరు చెయ్యొద్దని కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు. శివ బాలకృష్ణ ను ఇప్పటికే 8 రోజులు ఏసీబి కస్టడీ పూర్తయ్యింది. బాలకృష్ణ తరపు న్యాయవాది బెయిల్ మంజూరు చెయ్యాలని కోరారు. ఇరు వాదనలు పూర్తికాగా.. బెయిల్ పిటిషన్ పై వచ్చే సోమవారం తీర్పు ప్రకటిస్తామని నాంపల్లి ఏసీబి కోర్టు తెలిపింది.
Read also: Kishan Reddy: బీఆర్ఎస్ కార్యకర్తలు మోడీ నాయకత్వాన్ని బలపరచాలి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాగా.. మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కస్టడి కన్ఫేషన్ స్టేట్మెంట్ కీలకంగా మారిన విషయం తెలిసిందే.. కస్టడి కన్ఫేషన్ లో ఒక ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన రావడంతో ఈ కేసుపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. పలువురి ఒత్తిడి మేరకే అక్రమాలు, ఆస్థులు అంటూ శివబాకృష్ణ స్టేట్మెంట్ ఇవ్వడం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికే శివ బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ లెక్కల ప్రకారం 1000 కోట్ల విలువైన ఆస్తులు ఏసీబి గుర్తించింది. 214 ఎకరాలు భూములు గుర్తించింది. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. శివ బాలకృష్ణ తోళపాటు ఇతర అధికారుల పాత్ర పై ఆరా తీస్తున్నారు. శివ బాలకృష్ణ బినామీలపై ఏసీబి దర్యాప్తు కొనసాగుతుంది. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ ఫోకస్ పెట్టింది. కేసు వివరాల సేకరణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొనసాగుతున్నాయి. సోదరుడు నవీన్ అదుపులో తీసుకున్న అధికారులు మరో ఇద్దరి అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. బెయిల్ పిటిషన్ ఫై విచారణ అనంతరం సోమవారానికి వాయిదావేసింది.
Kishan Reddy: బీఆర్ఎస్ కార్యకర్తలు మోడీ నాయకత్వాన్ని బలపరచాలి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు