కాల్‌డేటా రికార్డులపై విచారణ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఏసీబీ కోర్టులో చంద్రబాబు, సీఐడీ లాయర్ల మధ్య వాగ్వాదం తలెత్తింది.
ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌కు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతించింది. సోమవారం చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలని పేర్కొంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు సోమవారం అత్యంత కీలకంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు సంబంధించి కోర్టుల్లో ముఖ్యమైన తీర్పులు రేపే వెల్లడికానున్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై తీర్పులు, విచారణలు రేపే ఉండడం గమనార్హం.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మరోసారి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు చంద్రబాబుకు ఏసీబీ జడ్జ్ చెప్పారు.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తైన తర్వాత ఏసీబీ కోర్టు గంట పాటు కేసును వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించనున్నారు.