Kolkata Protest: కోల్‌కతా వీధుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. ఈ సవరణ డ్రైవ్ అనేది ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించే “నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. READ ALSO: DMF…
పాకిస్థాన్ తీరును అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్రం రాజకీయ పార్టీలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఏడు బృందాలను ఆయా దేశాలకు పంపించేందుకు రాజకీయ పార్టీలను పేర్లు అడిగింది. కానీ పేర్లు ఇవ్వకముందే కేంద్రం.. కమిటీ సభ్యుల్ని ఎంపిక చేసింది.
Abhishek Banerjee: పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పించాల్సిన సమయం ఆసన్నమైందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆదివారం అన్నారు. పాకిస్తాన్ ఆక్రమించిన మన భూభాగాలను తిరిగి పొందాలని అన్నారు. ఇక సర్జికల్ స్ట్రైక్స్ వద్దని పీఓకేని స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సూచించారు. "పాకిస్తాన్‌కి అర్థమయ్యే భాషలో వారికి పాఠం నేర్పాల్సిన సమయం ఇది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ని తిరిగి పొందాల్సిన సమయం ఇది." అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై సినీ, క్రీడా ప్రముఖులు మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మృతికి నివాళులు అర్పించే విషయంలో క్రీడా, సినీ రంగ ప్రముఖులు మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
Abhishek Banerjee: మమతా బెనర్జీ రాబోయే తరానికి రాజకీయాలను అప్పగించాలనుకుంటున్నారా? ఈ ప్రశ్న గత కొన్ని రోజులుగా కోల్‌కతా వీధుల నుండి ఢిల్లీ వరకు ప్రజల వరకు మదిలో మెదులుతోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ 37వ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డైమండ్ హార్బర్ ఎంపీనే తదుపరి ముఖ్యమంత్రి కాగలరని రాజ్యసభకు చెందిన టీఎంసీ మాజీ ఎంపీ కునాల్…
Abhishek Banerjee: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ కేసుని సరిగా డీల్ చేయడంలో బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు విఫలమైనట్లు కలకత్తా హైకోర్టు చీవాట్లు పెట్టింది. కేసుని సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.
పశ్చిమబెంగాల్‌లో జరిగిన టీచర్స్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కేసులో జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.
Congress: కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని దారుణంగా ఓడించామని సంబర పడుతున్న కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఎదురుదెబ్బ తాకింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందాడు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పార్టీలో చేరాడు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ సోమవారం టీఎంసీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేారారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్‌చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు మోడీ, మమత ఒక్కటయ్యారని ఆరోపించారు. దేశంలో అసలు యూపీఏ లేదని మమత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. దీదీ, బీజేపీ సంబంధాలు పాతవేనని… తనతో పాటు, పార్టీని, మేనల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందు మోడీతో మమత లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే పలు మార్లు దీదీ మోడీ…