నేడు మెగాస్టార్ గా జనం మదిలో నిలచిన చిరంజీవి తన తరం హీరోల్లో నవలానాయకునిగానూ జేజేలు అందుకున్నారు. అంతకు ముందు తెలుగునాట నవలానాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జైత్రయాత్ర చేశారు. ఆయన తరువాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు.