ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టే మనసు తెలుగువారి సొంతం. భాషాభేదాలు లేకుండా టాలెంట్ ను గుర్తించడంలో ముందుంటారు మన తెలుగువారు. అందువల్లే ఎంతోమంది పరభాషా తారలు మన చిత్రసీమలో జేజేలు అందుకుంటున్నారు. ఇతర భాషలకు చెందిన వారి దృష్టి సైతం తెలుగు సినిమావైపే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనటుడు శివకుమార్ తనయులు సూర్య, కార్తీ ఇద్దరూ తెలుగునాట కూడా రాణిస్తున్నారు. సూర్య ముందుగానే వచ్చి, తెలుగువారిని అలరించినా, ఆయన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగు…