ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే సంక్షేమ పథకాలు పొందడానికి ఆధార్ కార్డులను అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో పాత జిల్లా పేర్ల స్థానంలో కొత్త జిల్లా పేర్లను చేర్చే విషయంపై అధీకృత సంస్థతో చర్చిస్తున్నామని ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి బాబు వివరించారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పుపై మంగళవారం సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధించి పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. మండలం,…