అమ్మ తిట్టిందనో.. పరీక్ష పాస్ అవ్వలేదనో … ఆర్థిక ఇబ్బందులో.. అక్రమ సంబంధాల వల్లో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇదే పరిస్థితి. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దాంతో కన్నవాళ్లకు కడుపు కోత మిగులుతుంది. ఈ ఆత్మహత్యల వల్ల కొందరు పిల్లలను కోల్పోతుంటే.. మరికొందరు పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. చిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకోవడం పరిపాటిగా మారింది.…