కరోనా మహమ్మారి విరుచుకుపడుతోన్న సమయంలో.. ఎవ్వరైనా సరే తమకు ఏంటి? అన్నట్టుగా.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి.. కొందరు లక్షలు చదివించినా.. తమవారి ప్రాణాలు దక్కలేదని వాపోతున్నారు.. కనీసం బిల్లులు కూడా వేయకుండా.. వైట్ పేపర్లపై రాసిచ్చి డబ్బులు గుంజేవారు కూడా లేకపోలేదు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.. దీంతో.. ఆ 88 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని.. 24 నుంచి 48 గంటల్లో సమాధానం…