గత రెండు దశాబ్దాలుగా తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యలో ఎన్నో ఘనతలు సాధించి ఈ మధ్యకాలంలో విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిన అనురాగ్ యూనివర్సిటీ తన ఖాతాలో మరో మైలురాయిని నమోదు చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం చేపట్టిన ఆజాదికా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జరగబోయే 75 విద్యార్థుల ఉపగ్రహాల మిషన్ (75 Student satilite Mission)లో పాల్గొననుంది. ఇందుకోసం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ (ITCA)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫిబ్రవరి 2న బుధవారం…