యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు భారీ అభిమానగణం ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ సినిమా విడుదల అవుతుందంటే నందమూరి అభిమానుల హడావుడి మాములుగా ఉండదు. అయితే సోషల్ మీడియాలోనూ విశేషంగా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరో మైలు స్టోన్ ను అందుకున్నారు. నిన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా… ఒకేరోజు తారక్ ను దాదాపు 2 వేల మంది ఫాలో…