Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అంగీకరించారు. ‘‘భారతదేశం రష్యాకు అతిపెద్ద కస్టమర్. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల నేను 50 శాతం సుంకం విధించాను. అది చేయడం తేలికైన విషయం కాదు.’’ అని ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.