ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగింది. మే నెలలో ద్రవ్యోల్బణం 4.75 శాతంగా ఉంది. అంతకుముందు ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉంది. కాగా.. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను గణాంకాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.