ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నుంచి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఈరోజు తెల్లవారుజామున గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొట్టుకోవడంతో నలుగురు మరణించారు. ఇక, ఈ ప్రమాదంలో 60 మందికి గాయాలు అయ్యాయి.