ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటేనే బిందాస్.. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఇబ్బందులు వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ నిలదొక్కుకున్నాయి ఐటీ సంస్థలు.. అయితే, ఇప్పుడు మళ్లీ ఐటీ ఉద్యోగులను కష్టాలు వెంటాడుతున్నాయి.. ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేలా మెటా, ట్వి టర్, సేల్స్ ఫోర్స్ , మైక్రోసాఫ్ట్, స్ట్రైప్లు ఇలా దిగ్గజ సంస్థలు అన్ని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.. ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చేస్తున్నాయి.. ఇప్పుడు ఆ జాబితాలో మరో ఐటీ దిగ్గజ సంస్థ సిస్కో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థలో 83 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా.. వారిలో 4,100 మంది సిబ్బందిపై వేటు వేసేందుకు సిద్ధమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా బిగ్ టెక్ లేఆఫ్ లీగ్‌లలో మరో ప్రధాన ఐటీ దిగ్గజం చేరినట్టు అయ్యింది.. నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో 4,100 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం.
Read Also: Koregaon-Bhima Violence Case: జైలు నుంచి ఉద్యమకారుడు గౌతమ్ నవ్‌లఖా విడుదల.. గృహ నిర్బంధం
ఇక, ఈ నివేదికలపై స్పందించిన సిస్కో ఛైర్మన్ మరియు సీఈవో చక్ రాబిన్స్, ఉద్యోగుల తొలగింపుపై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.. మేం చేస్తున్నది కొన్ని వ్యాపారాలపై హక్కులు కల్పించడం అని నేను చెబుతాను అని పేర్కొన్నారు.. మరోవైపు, సిస్కో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్కాట్ హెరెన్ ఈ చర్యను “రీ బ్యాలెన్సింగ్” చర్యగా అభివర్ణించారు. దీనిని ఖర్చు ఆదా చేయడం ద్వారా ప్రేరేపించబడిన హెడ్‌కౌంట్ చర్యగా భావించవద్దు. ఇది నిజంగా రీబ్యాలెన్సింగ్. మేం బోర్డు అంతటా చూస్తున్నప్పుడు, మరింత పెట్టుబడి పెట్టాలనుకునే ప్రాంతాలు ఉన్నాయి. భద్రత, ప్లాట్‌ఫారమ్‌లు మరియు మరిన్ని క్లౌడ్ డెలివరీ చేసిన ఉత్పత్తులకు మా పెట్టుబడుల తరలింపు ఉంటుందన్నారు.. పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న రంగాల్లో కంపెనీ ప్రారంభించిన ఉద్యోగాల సంఖ్యను పరిశీలిస్తే, “ప్రభావితం అవుతుందని మేం విశ్వసిస్తున్న వ్యక్తుల సంఖ్య కంటే ఇది కొంచెం తక్కువ అని అన్నారు.