దసరా పండుగ సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్వయంగా వెల్లడించారు.. దసరా సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యం కోసం స్పెషల్ బస్సులను తిప్పనున్నాం.. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 4500 స్పెషల్ బస్సులు నడుపుతామని తెలిపారు.. 2100 ఫ్రీ దసరా బస్సులు నడుపుతాం.. సాధారణ ఛార్జీలతోనే అదనపు బస్సులు తిప్పుతామని స్పష్టం చేశారు.. ఈ పోస్ ద్వారా కూడా టికెట్లు అమ్ముతాం.. ప్రతి బస్సుకు జీపీఎస్ ట్రాకింగ్ వుంటుందన్నారు.. 24 గంటల పాటు పర్యవేక్షించేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం.. ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా 2470005 నెంబర్‌తో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని.. పండుగ సమయాల్లో టికెట్ ధరలు పెంచారన్న అపప్రద రాకుండా సాధారణ ధరకే టికెట్లు అమ్ముతామని వెల్లడించారు.
Read Also: Munugode By Poll: మునుగోడు ఉపఎన్నికకు 16 మందితో బీజేపీ స్టీరింగ్ కమిటీ
దసరా సందర్భంగా ప్రైవేటు బస్సులు అధిక టికెట్లు విక్రయాలు చేస్తాయి.. వాటికి అడ్డుకట్ట పడుతుందన్నారు ద్వారకా తిరుమలరావు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు రాష్ట్రంలో కూడా స్పెషల్ బస్సులు తిప్పుతామన్న ఆయన.. తిరుమల బ్రహోత్సవాల సందర్భంగా 10 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని వెల్లడించారు. కడప పాత బస్ స్టాండ్ అద్దె సమస్య పరిష్కరిస్తాం… ఆర్టీసీ బస్ స్టేషన్లల్లో స్టాళ్లల్లో అధిక ధరలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్ స్టేషన్ల ప్రాంగణంలో నీరు నిలువకుండా ఎత్తు పెంచుతాం.. శుభ్రంగా ఉంచుతామన్నారు. కాగా, దసరా సందర్భంగా.. హైదారాబాద్ , చెన్నై మరియు బెంగళూరు ప్రాంతాల నుంచి విజయవాడకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది.. అంతేకాకుండా విజయవాడ నుంచి విశాఖ, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, తిరుపతి, భద్రాచలం, రాయలసీమ ప్రాంతాలకు సైతం ఈ దసరాకు బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ. గత రెండేళ్లుగా కోవిడ్‌తో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్లు.. సొంతూళ్లకు దూరం అయ్యారు. అంతేకాదు కోవిడ్ నిబంధనలతో దసరా ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుండి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు తక్కువ అయిన పరిస్థితి. ప్రస్తుతం కరోనా భయం తోలగటంతో ఈ సారి ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు సంఖ్య అధికంగానే ఉంటుందని భావించిన అధికారులు ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.