Andhra Pradesh: గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో కొత్త 4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ ఆంగన్వాడీ కేంద్రాలను మెయిన్ ఆంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనుంది.. ఈ అప్‌గ్రేడ్ కారణంగా, కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కాగా, ఇప్పటికే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. పదో తరగతి ఉత్తీర్ణులైన 4,687 మంది మిని అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించిన విషయం విదితమే కాగా.. ఇక, వీరి గౌరవ వేతనాన్ని నెలకు రూ.11,500గా నిర్ణయించింది. మరోవైపు, ఇటీవలే ఏపీ కేబినెట్ సమావేశంలో 4,687 అంగన్వాడీల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది ఏపీ కేబినెట్.. ఇప్పుడు.. 4,687 అంగన్వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Donald Trump: భారత్‌పై సుంకం అంత తేలికైన పని కాదు, సంబంధాలు దెబ్బతిన్నాయి..