(అక్టోబర్ 9న ‘అపూర్వ సహోదరులు’కు 35 ఏళ్ళు)నందమూరి బాలకృష్ణ నటజీవితంలో ఒకే యేడాది ఆరు వరుస విజయాలు చూడటం అన్నది మరపురాని విజయం. 1986లో ఈ విశేషం చోటు చేసుకుంది. ‘ముద్దుల క్రిష్ణయ్య’తో ఆరంభమైన ఆ ఘనవిజయం ‘అపూర్వ సహోదరులు’తో పూర్తయింది. 1986లో బాలకృష్ణ చివరి చిత్రంగా వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ అక్టోబర్ 9న దసరా కానుకగా జనం ముందు నిలచింది. బాలకృష్ణ నటనాపర్వంలో తొలి ద్విపాత్రాభినయ చిత్రంగానూ ‘అపూర్వ సహోదరులు’ నిలచింది. ప్రేక్షక హృదయాలను గెలిచింది.…