అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులే తమ విధానం అంటోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధాని డిమాండ్‌తో ఉత్తరాంధ్ర ప్రాంతాలని కలుపుకుని విశాఖ గర్జన జరిగింది.. నాన్ పొలిటిక్‌జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ గర్జనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన వైసీపీ.. ఈ కార్యక్రమంలో మంత్రలు, పార్టీ నేతలు పాల్గొనేలా చేసింది.. ఇప్పుడు సీమలోనూ మూడు రాజధానుల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం అంటున్న జగన్మోహన్‌రెడ్డి సర్కార్..…
విశాఖ గర్జనను విజయవంతం చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. జేఏసీ పిలుపునకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించిన వైసీపీ.. జనసమీకరణపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. భూమికోసం, భుక్తి కోసం, హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో పోరాటాలకు పుట్టినిల్లుగా నిలిచిన శ్రీకాకుళం జిల్లా నుండి రాజధాని వికేంద్రీకరణ చర్యకు మద్దతుగా నిలిచేందుకు మరో ఉద్యమానికి శ్రీకారంచుట్టాలని కోరారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఏర్పాటు అయ్యేందుకు…