Yv Subbareddy Hot comments on amravati yatra
ఏపీలో మూడురాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు అక్టోబర్ 15, శనివారం విశాఖ గర్జన జరగనుంది. ప్రజాసంఘాలు, అధికార వైసీపీ నేతలు విశాఖ గర్జన ర్యాలీని విజయవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు. విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు గౌరవించాలన్నారు. వికేంద్రీకరణ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. అందులో భాగంగానే మూడురాజధానులకు మద్దతు ఇస్తున్నామన్నారు.
Read Also: Dharmana PrasadaRao:మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటారా?
అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయరాజధాని, విశాఖలో పాలనా రాజధాని రావాలి. దేశంలో ప్రముఖ నగరంగా విశాఖ వుంది.. ఇక్కడ రాజధాని నిర్మించుకుని పాలన కొనసాగిస్తే బావుంటుంది… అమరావతి పాదయాత్ర చేస్తున్నవారికి నిరసన తెలపాలని జేఏసీ పిలుపు మేరకు విశాఖ గర్జన చేపట్టాం..దీనికి వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతున్నాం.. దానిలో భాగంగా ర్యాలీని విజయవంతం చేయాలని భావిస్తున్నాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అమరావతికి మేం ఏ కోశానా వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో జరిగే ర్యాలీకి పార్టీ శ్రేణులు మద్దతు ఇస్తున్నాయన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుని తీరతామన్నారు. ప్రజల మనోభావాలను యాత్ర నిర్వాహకులు గౌరవించాలన్నారు.
Read Also: Amaravati Padayatra: నిడదవోలులో ఉద్రిక్తత.. జేఏసీ వర్సెస్ రైతులు