వైసీపీని ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ తన భుజస్కంధాలపై పెట్టుకొని నడిపిస్తున్నాడని జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ ప్రశంసించారు. 2029 ఎన్నికలలో జిల్లాలో మొట్టమొదట గెలిచేది అవినాషే అని పేర్కొన్నారు. కడియాల బుచ్చిబాబు తూర్పు నియోజకవర్గానికి కాదు, పార్టీకి కొండంత అండ అని చెప్పారు. వైఎస్ జగన్ ఓడిపోయిన తరువాత ప్రజలకు ఆయన విలువ తెలిసిందని మోదుగుల అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో క్యూ కోడ్ ద్వారా…
Asaduddin Owaisi: కేంద్రం ఇటీవల జనాభా లెక్కలతో పాటే ‘‘కులగణన’’ చేస్తామని ప్రకటించింది. 2024 ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్‌తో సహా పలు ఇండీ కూటమి పార్టీలు కులగణనను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కులగణనపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల్ని లేవనెత్తారు. కులగణనకు కేంద్రం ఒక టైమ్ లైన్ ఉండాలని కోరారు.
Addanki Dayakar: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీజేపీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్, సౌత్‌లో రాజకీయ కుట్రలు పన్నుతోందని దయాకర్ ఆరోపించారు. జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు…
Kakani Govardhan Reddy: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ తీరును ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ తీరును, ముఖ్యంగా ఎమ్మెల్యేలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఎస్.పి. తన విధులకు కాస్త దూరంగా ఉంటున్నాడని, వెంకటాచలం మాజీ జెడ్పిటిసి…